Friday, October 8, 2010

ప్రణయిని

: రంగుల సీమలోన నవరత్నములన్నియు చిన్నబోవగా
జాగును సేయబోకుమరి చక్కని రూపుతో సోయగమ్ముతో
వేగమె రావె నాచెలియ వెన్నెల వంటిది నీదు మోమనీ
రాగము లన్ని ఏకమయి రమ్మని పాడుచు నుండగా సఖీ !

తే.గీ. గగన మందున్న జాబిల్లి గురుతుబట్టి
చిన్నబోయెను నినుజూచి చిన్నదాన
వయసు పదహారు గల్గిన వన్నేదానా
వచ్చి విరహమ్ము దీర్చవె వాలుకనుల

తే.గీ. వెదకినానిటు నినుగూర్చి వెదకినాను
చేరినానిటు నీదారి చేరినాను
అందినానిటు నీచేయి నందినాను
అవనినందింక నిదిగాక నదికముంద

: అన్నులమిన్న! నీ మనసునందున నాటిన ప్రేమ బాణముల్
కన్నను వాడినీ కనుల గాన్చేది చూపుల కాంతి రేఖలే
మిన్నను నామదిన్ నిలిచి మల్లెను బోలిన నావ్వులిచి నీ
సన్నని గొంతుతో పిలచి చక్కని చుక్కల నేల నిల్వవే !

తే.గీ. స్వప్నలోకమునందున జేరి వలచి
నాడు మనసున నిండుగ నాక్రమించి
కనుల రెప్పల దాగున్న కాంతినీవు
వెలుగు నవ్వులు వెదజల్లు వెలుగు నీవు

: నవ్వుల చందమామ గగనానికి వన్నియ తెచ్చుచుండగా
నవ్వవె నిచ్చతన్ చెలియ నామది నిండుగ నిండిపోవగా
నవ్వుల పంటనే నిలను నిక్కము జేయగ రావే నాప్రియా
నవ్వుల వెన్నెలన్ కురియ నేరెడు కన్నుల భామవే కదా!

No comments:

Post a Comment