Wednesday, May 5, 2010

నా దేశ యువజనులారా

నా దేశ యువజనులార
నిస్తేజం కాకండి
నవసమాజ నిర్మాణంలో
భాగస్వాములు కండి !

నవ భారత యోధుల్లారా
నగుమోముతో సాగండి
కడగండ్ల వదగండ్లన్ని
కరిగించి వేయండి !

మీ ఆశల రెక్కల నిండా
జావసత్వం నింపండి
సమసమాజ స్థాపనలో
మున్ముందుకు సాగండి !

భరతమాత బిడ్డల్లారా
నింగి అంచు తాకండి
అంబరాన్ని చుమ్బించేలా
ఉవ్వెత్తున లేవండి !

నా దేశ యువజనులారా
భయాన్ని వదిలేయండి
నమ్మకమను ఆయుధామ్ముతో
భవిష్యత్తును గెలవండి!

-
మీ కిరణ్


No comments:

Post a Comment