Friday, May 27, 2016

కోకిలమ్మ పదాలు

నిదుర పోతే లలు
మేలుకొంటే వలలు
తుకు సంద్రపు అలలు
కోకిలమ్మ!
కారు చీకటి నలుపు
జాబిలమ్మది తెలుపు
కవిత బంగరు తళుకు
ఓ కోకిలమ్మ!
కారు మబ్బులు గాన
కురవదా? జడివాన
ఎదురు చూపుల మైన
ఓ కోకిలమ్మ!!! 





Sunday, November 6, 2011

భామినీ

సీ. నిలవవే భామినీ నినుజూచి మనసంత
నివ్వెరైపోయెనే నీలవేణి!

ఆగవే అందాల అపరంజి యాగవే
శిలనైన కరిగించు చక్కనమ్మ!

నీలాల కళ్ళలో నెలకొన్న రూపమ్ము
మనసుతో చూడవే ముద్దుగుమ్మ!

పగడాల దీవిలో ప్రసరించు వెన్నలై
ననుజేరి వెలగవే నవనిలోన!

తీ.గీ. నేడు నినుగూర్చి వెదకేటి నన్ను జూచి
వేరు వ్యక్తులు నవ్వగ నేమి లోటు
నిన్ను పొందగ నిలలోనె నేనె గొప్ప
నన్ను మించిన వారిక నిలనులేరు!!

Thursday, November 3, 2011

సాధిస్తా

అందరిలా పుట్టినాను
అందరిలా పెరిగినాను
అందరిలా చావలేను
యేదో సాధిస్తాను;

మరమనిషిని కాదుకదా!
మనసన్నది వుందికదా
మంచన్నది చేస్తాను
మానవతను పెంచుతాను!

ప్రతిమనిషీ గొప్పవాఢు
వాడో కారణజన్ముడు
యేదైనా చేయగలడు
క్రుషితో సాధించగలడు

మంచి పనులు చేయుటలో
అడ్దంకులెన్ని వున్నా
అధిగమించి పోవాలి
అనుకున్నది సాధించాలి!

Monday, October 11, 2010

మౌనం

మౌనం -
అదొక నిశబ్ద ప్రళయం
ఆర్ద్ర హృదయాల మధ్య
ఒక పెద్ద అఘాధం!

మౌనం-
అదొక ప్రస్నాలవలయం
అర్దంగీకారానికి
ఒక ప్రతిరూపం!

మౌనం-
పురివిప్పిన జడచేతనం
విధి వంచితలు ఆలపిస్తున్న
నిశబ్ద రాగామృతం!

ఒకటే

ఎడుగుర్రాల సూరీడు
ఎలుగెత్తి చాటాడు
ఏడు వర్ణాలు ఒకటేనని!

ఏడు స్వరాల నాదాలు
ఒక్కటిగ పలికాయి
మనమంతా ఒకటేనని!

మనమంతా యేనాడు చెబుతాము
మానవతమె మన మతమని???

Sunday, October 10, 2010

భావిభారత స్వప్న రాజ్యము

అదిగో అదిగో వచ్చుచున్నది
భావి భారత స్వప్న రాజ్యము
నవ్య భారత భవ్య తేజము
( అదిగో )

శాంతి అనియెడి పావురమ్ములు
నింగికేగసీ అంబరమ్మున
సంబరమ్ముగా ఎగురుచుండగా
(అదిగో)
సూర్య తేజము పుడమి సోకగ
క్రాన్తియుతమై వెలుగు చుండగా
రక్తపాతము మీకు తగదని
జాతి అంతా ఒకటికమ్మని
కొత్తపాటను కోయిలమ్మలు
పాడుచుండగ పల్లవించగ
(అదిగో)
సామరస్యపు జీవజలములు
భారతోర్విని పొంగి పొరలాగా
నవసమాజపు విత్తనములు
సమసమాజపు వృక్షములుగా
ఫలములివ్వగా వరములివ్వగా
(అదిగో)
బానిసత్వపు కట్టుబాట్లను
గోలుసులన్నీ త్రెంచివైచీ
వుడుకురక్తం నరనరాలలో
వురకలెత్తగా వుద్యమించగా
యువకులంతా ఒక్కటవగా
వచ్చుచున్నది వచ్చుచున్నది
భావిభారత స్వప్నరాజ్యము
నవ్యభారత భవ్య తేజము
(అదిగో)




Friday, October 8, 2010

ప్రణయిని

: రంగుల సీమలోన నవరత్నములన్నియు చిన్నబోవగా
జాగును సేయబోకుమరి చక్కని రూపుతో సోయగమ్ముతో
వేగమె రావె నాచెలియ వెన్నెల వంటిది నీదు మోమనీ
రాగము లన్ని ఏకమయి రమ్మని పాడుచు నుండగా సఖీ !

తే.గీ. గగన మందున్న జాబిల్లి గురుతుబట్టి
చిన్నబోయెను నినుజూచి చిన్నదాన
వయసు పదహారు గల్గిన వన్నేదానా
వచ్చి విరహమ్ము దీర్చవె వాలుకనుల

తే.గీ. వెదకినానిటు నినుగూర్చి వెదకినాను
చేరినానిటు నీదారి చేరినాను
అందినానిటు నీచేయి నందినాను
అవనినందింక నిదిగాక నదికముంద

: అన్నులమిన్న! నీ మనసునందున నాటిన ప్రేమ బాణముల్
కన్నను వాడినీ కనుల గాన్చేది చూపుల కాంతి రేఖలే
మిన్నను నామదిన్ నిలిచి మల్లెను బోలిన నావ్వులిచి నీ
సన్నని గొంతుతో పిలచి చక్కని చుక్కల నేల నిల్వవే !

తే.గీ. స్వప్నలోకమునందున జేరి వలచి
నాడు మనసున నిండుగ నాక్రమించి
కనుల రెప్పల దాగున్న కాంతినీవు
వెలుగు నవ్వులు వెదజల్లు వెలుగు నీవు

: నవ్వుల చందమామ గగనానికి వన్నియ తెచ్చుచుండగా
నవ్వవె నిచ్చతన్ చెలియ నామది నిండుగ నిండిపోవగా
నవ్వుల పంటనే నిలను నిక్కము జేయగ రావే నాప్రియా
నవ్వుల వెన్నెలన్ కురియ నేరెడు కన్నుల భామవే కదా!